హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు భావజాలా న్ని ప్రోత్సహించేలా మాట్లాడారన్న ఆరోపణలతో ‘ఉపా’ చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నమోదు చేసిన కేసులో గాదె ఇన్నయ్య అలియాస్ గాదె ఇన్నారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్తోపాటు అంతే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజన ధర్మాసనం 65 పేజీల తీర్పు వెలువరించింది.