BJP Party | హైదరాబాద్ : మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్పై హైకోర్టు స్టే విధించింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు.
బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్ఆజీఎస్ ఉద్యోగులను 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సీసీ కెమెరా ఆధారంగా గుర్తించి సస్పెండ్ చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్. https://t.co/R1zSGuy5mR pic.twitter.com/iB7aJITbj2
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2024