టీస్టాల్ తొలగించిన కలెక్టర్‌పై పోస్ట్.. క్రిమినల్ కేసు కొట్టివేత
సిరిసిల్లలో టీస్టాల్ తొలగింపు వ్యవహారంలో కలెక్టర్ తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నమోదైన క్రిమినల్ కేసును హైకో ర్టు తాజాగా కొట్టివేసింది. ప్రజాప్రయోజన అం శాలపై ఒక ప్రభుత్వ అధికారి ప్రవర్తనను విమర్శనాత్మకంగా ప్రస్తావించడంలో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం ఉండదని తీర్పులో స్పష్టంచేసింది.
- నిరుడు రాజన్న సిరిసిల్లలో కలకలం రేపిన ఘటన
- ‘కలెక్టర్.. కాంగ్రెస్ కార్యకర్త’ అంటూ ఎక్స్‌లో పోస్ట్
- తాజాగా కేసును కొట్టేసిన హైకోర్టు
- ఇది గొంతెత్తిన ప్రతి ఒక్కరి విజయమని వెల్లడి
రాజన్న సిరిసిల్ల మార్చి 31(నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో టీస్టాల్ తొలగింపు వ్యవహారంలో కలెక్టర్ తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నమోదైన క్రిమినల్ కేసును హైకో ర్టు తాజాగా కొట్టివేసింది. ప్రజాప్రయోజన అం శాలపై ఒక ప్రభుత్వ అధికారి ప్రవర్తనను విమర్శనాత్మకంగా ప్రస్తావించడంలో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం ఉండదని తీర్పులో స్పష్టంచేసింది. అసలేం జరిగిందంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని బతుకమ్మ ఘాట్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై కేటీఆర్ ఫొటోతో ఉన్న టీస్టాల్‌ను అప్పటి కలెక్టర్ తొలగించారు. టీస్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్‌కు బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ అభిమానులు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలిచారు. ఓ చిరు వ్యాపారిపై కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది.
‘రోజువారీ కూలీగా పనిచేసే టీ కొట్టు నిర్వాహకుడు కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకు.. కలెక్టర్ ఒక స్వతంత్ర ప్రభుత్వ అధికారిగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ హైదరాబాద్‌వాసి నాయిని అనురాగ్‌రెడ్డి నిరుడు ఫిబ్రవరి 19న ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అంతేగాక అతని దుకాణంలోని కేటీఆర్ ఫొటోను తొలగించగలరేమో గానీ, అతని హృదయంలో ఉన్న కేటీఆర్ అభిమానాన్ని మీరేలా తొలగించగలరని ప్రశ్నించగా, ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది. దీనిపై కలెక్టర్ ఆదేశాలతో అనురాగ్‌రెడ్డిపై సిరిసిల్ల కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును సవాల్ చేస్తూ అనురాగ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. మంగళవారం విచారణకు వచ్చిన ఆ కేసును హైకోర్టు కొట్టివేయగా, అనురాగ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశా డు. ఇది కేవలం ఒక వేదిక ఉన్నవారికే కాకుండా గొంతెత్తిన ప్రతి ఒక్కరికీ లభించిన విజయమని పేర్కొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

