హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తమ కాలేజీలో అనుమతించిన మెడికల్, పీజీ మెడికల్ ప్రవేశాలను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వికారాబాద్‌లోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
అడ్మిషన్ల రద్దు నిర్ణయాన్ని ఎన్‌ఎంసీలోని కమిటీ ఎదుట తేల్చుకోవాలని సూచించింది. ఎన్ఎంసీ కమిటీ వద్ద అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది.