హరీశ్‌రావు మామకు ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మామ మాధవరపు హనుమంతరావుకు చెందిన 3.22 ఎకరాల భూమి స్వాధీనం వ్యవహారంలో బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
- హనుమంతరావు భూమి స్వాధీనంపై బలవంతపు చర్యలొద్దు
- హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మామ మాధవరపు హనుమంతరావుకు చెందిన 3.22 ఎకరాల భూమి స్వాధీనం వ్యవహారంలో బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలోని ఈ భూమికి సంబంధించి సెప్టెంబర్ 29న అధికారులు జారీచేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ హనుమంతరావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారణ చేపట్టారు.
షోకాజ్ నోటీసు ఆధారంగా పిటిషనర్‌ను భూమి నుంచి ఖాళీ చేయించడం సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. నోటీసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దా ఖలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, హనుమంతరావు చాలా ఏండ్ల క్రితమే పట్టాదా రు నుంచి కొనుగోలు చేశారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

