హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్‌లో పానీపూరీ వ్యాపారి భార్య హత్య కేసులో రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్‌కు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
ప్రత్యక్ష సాక్ష్యాలు, నేరాన్ని నిర్ధారించే పటిష్ట ఆధారాలు లేకుండా కేవలం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించడం, యావజ్జీవ శిక్ష విధించడం చట్టబద్ధం కాదని పేర్కొన్నది.