రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 76 మంది జూనియర్ సివిల్ జడ్జిలను హైకోర్టు శనివారం బదిలీ చేసింది. జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబందించిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జారీచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా శ్రీమతి ఉషాక్రాంతి, 6వ అదనపు మేజిస్ట్రేట్‌గా శ్యాంప్రసాద్, 7వ అదనపు మేజిస్ట్రేట్‌గా డీ దేవేంద్రబాబు, హయత్‌నగర్ కోర్టుకు శ్రీమతి చందన, ఇబ్రహీంపట్నం కోర్టులకు ముదిగొండ రాజు, అనామిక బదిలీ అయ్యారు. న్యాయమూర్తుల బదిలీలపై జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటపల్లి భాస్కర్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు.