హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తెలుగులో మొట్టమొదటి ఫ్యాక్ట్ చెక్ పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం ఆవిషరించారు. ‘ఫ్యాక్ట్ చెక్ చేయడం ఎలా?-చీఫ్ ఫేక్ నుంచి డీప్ ఫేక్ దాకా’ అనే పుస్తకం తెలుగులో రావడం ఇదే ప్రప్రథమం. సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్‌చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్‌రెడ్డి, ఫ్యాక్ట్ చెకర్ బీఎన్ సత్యప్రియ రాసిన పుస్తకాన్ని హైకోర్టు ఆవరణలో న్యాయమూర్తి ఆవిషరించారు. సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయిన నేపథ్యంలో తప్పుడు వార్తలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న తరుణంలో వాటిలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి, సామాజిక శాస్ర్తాల డీన్ ప్రొఫెసర్ కే స్టీవెన్సన్ పాల్గొన్నారు.