హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సెప్టెంబర్ నెలలో జీఎస్టీ రూ.5,226 కోట్లు వసూలైంది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే 30% అధికంగా రాబడి వచ్చింది. ఈ సారి ఆగస్టులో జీఎస్టీ రూ.4,393 కోట్లు వసూలు కాగా, ఆగస్టుతో పోలిస్తే రూ.833 కోట్లు అదనంగా వసూలైంది.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే జీఎస్టీ వసూళ్లలో దూకుడు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రతినెలా వృద్ధి రేటు నమోదవుతూనే ఉన్నది.