హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ) : కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురసారం-2024కి ఎంపికైన చేనేత కార్మికులకు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులకు జాతీయ పురస్కారాలు దక్కితే, వారిలో రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారని తెలిపారు.
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గజం నర్మద చేనేత వస్ర్తాల మారెటింగ్ విభాగంలో రూ.8 కోట్ల టర్నోవర్ చేసినందుకు అవార్డు దక్కింది. సహజసిద్ధ రంగులను ఉపయోగించి జీఐట్యాగ్ పొ ందిన తేలియా రుమాల్ డిజైన్తో పట్టుచీర నే సిన గూడ పవన్ చేనేత జాతీయ అవార్డుకు ఎంపికయ్యారని చెప్పారు. వారు చేనేత రంగ ంలో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.