హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చేనేత వస్త్ర నైపుణ్యం, ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్టైల్ రిసెర్చ్ సాలర్ కైరా జాప్ గాబ్రియేల్ ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఇతర ప్రోత్సాహకాల పట్ల ఇకడి కార్మికులకు ఉన్న అవగాహన ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచలో ఎక్కడా లేనంత గొప్ప కళా నైపుణ్యం ఇకడి చేనేత వస్త్రాల్లో ఉన్నదని కొనియాడారు.
చేనేత ఉత్పత్తులు, కళలపై కొనసాగిస్తున్న అధ్యయనంలో భాగంగా కైరా తెలంగాణకు వచ్చారు. పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో కొనసాగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి, అకడి స్థితిగతులపై ఆమె అధ్యయనం చేశారు. బుధవారం ఆమె రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్టైల్ శాఖ మంత్రి కే తారకరామారావుతో ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. నేతన్నలకు, ముఖ్యంగా చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలతో పాటు వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి కైరాకు కేటీఆర్ వివరించారు.
తెలంగాణ చేనేత కళాకారులు తమ ఉత్పత్తులు, కళ పట్ల అత్యంత గర్వంగా ఉన్నారని, ముఖ్యంగా తమ పని పట్ల వారి నిబద్ధత గొప్పగా ఉన్నదని ఆమె ప్రశంసించారు. ఇతర దేశాలకు భిన్నంగా ఒకే చోట వందలాదిమంది చేనేత కార్మికులు కలిసి పనిచేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతున్నట్టు తాను గుర్తించానన్నారు.ఇకడి చేనేత ఉత్పత్తుల్లో ఉన్న కళా నైపుణ్యం ఎంతో విలువైనదని, ప్రపంచ మారెట్లలో దీనికి అద్భుతమైన డిమాండ్ ఉందని కైరా చెప్పారు. చేనేత కళను కేవలం చీరలకే కాకుండా ఇతర ఉత్పత్తులకూ విస్తరించాలని సూచించారు.
చేనేతపై దీర్ఘకాల పరిశోధనకు సమయాన్ని వెచ్చిస్తున్న కైరాకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆమె సూచనలు ఎంతో వైలువైనవని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. కైరా లాంటి విసృ్తత అధ్యయనం చేసిన నిపుణులు, సంస్థల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొనేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు.