Nuclear Warheads: భారత్ వద్ద 190 న్యూక్లియర్ వార్‌హెడ్స్: అమెరికా రిపోర్ట్
Nuclear Warheads: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తన రిపోర్టులో పేర్కొన్నది. దీంట్లో అదనంగా కొత్త క్షిపణుల కోసం 30 వార్‌హెడ్స్ ఉన్నట్లు తెలిపింది. ఎఫ్ఏఎస్ రిపోర్టును బుధవారం పబ్లిష్ చేశారు.
వాషింగ్టన్: భారత్ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు(Nuclear Warheads) ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తన రిపోర్టులో పేర్కొన్నది. దీంట్లో అదనంగా కొత్త క్షిపణుల కోసం 30 వార్‌హెడ్స్ ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ డేటా, కమర్షియల్ శాటిలైట్ ఇమేజ్‌లు, ఓపెన్ సోర్స్‌ల ద్వారా ఆ అంచనా వేసినట్లు ఎఫ్ఏఎస్ వెల్లడించింది. భారత్ వద్ద ఉన్న అణ్వస్త్ర సామర్థ్యం, వ్యూహం ప్రకారం .. ఆ దేశం ఇప్పటికే 190 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉత్పత్తి చేసినట్లు అంచనా వేస్తున్నామని ఎఫ్ఏఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ తెలిపారు. ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ 2026 టైటిల్‌తో అణ్వస్త్రాలపై ఓ రిపోర్టును బుధవారం రిలీజ్ చేశారు.
ఆపరేషనల్ లాంచింగ్ కోసం భారత్ అమ్ములపొదిలో 160 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నాయని, కొత్తగా తయారీ అవుతున్న క్షిపణుల కోసం అదనంగా మరికొన్ని వార్‌హెడ్స్ ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. ఇండియా తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని నిరాంతరాయంగా ఆధునీకరిస్తున్నట్లు ఆ ఆర్టికల్‌లో పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో కొత్తగా వెపన్ సిస్టమ్స్ వచ్చినట్లు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్, ల్యాండ్ డెలివరీ, సీ బేస్డ్ సిస్టమ్స్‌కు తగిన రీతిలో అణ్వాయుధాలు ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

