TSPSC | గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా.. కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ
వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం అధికారంగా టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్-2 పరీక్ష తాజాగా మరోసారి వాయిదా పడటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది.
- 783 పోస్టుల కోసం 5 లక్షల మంది దరఖాస్తు
- ఇప్పటికే రెండుసార్లు వాయిదా.. నిరాశలో అభ్యర్థులు
TSPSC | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం అధికారంగా టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్-2 పరీక్ష తాజాగా మరోసారి వాయిదా పడటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలో కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యుల రాజీనామా నేపథ్యంలో పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది.
రాష్ట్రంలో గ్రూప్-2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల అయింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒకో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిరహణకు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబరు 2, 3 తేదీలకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు. నవంబరు 1 నుంచి ఎన్నికల ప్రకియ ప్రారంభంకావడంతో తప్పని పరిస్థితుల్లో రెండోసారి గ్రూప్-2 పరీక్షను వాయిదా వేశారు. జనవరి 6, 7 తేదీల్లో కచ్చితంగా పరీక్ష నిర్వహిస్తారని భావించిన అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారు. మళ్లీ వాయిదా వేస్తూ ఉత్తర్వులు రావడంతో అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

