Arogya Mahila | ప్రపంచ మహిళా దినోత్సవం( World Womens Day ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8వ తేదీన ప్రారంభించే ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది అని తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుందన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా దీన్ని అందిస్తున్నదని చెప్పారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తాం అని హరీశ్‌రావు తెలిపారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తం 1200 సెంటర్లకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు.