హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి ఏపీ క్యాడర్లో బాధ్యతలు స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు ఈ నెల 24వ తేదీ వరకు నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా మహంతిని తెలంగాణ క్యాడర్‌లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 171ను పరిగణనలోకి తీసుకున్నారో లేదో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర అభ్యర్థనను కేంద్ర హోం శాఖ తిరసరించింది. ఏపీ క్యాడర్లో చేరాలని ఉత్తర్వులు జారీచేసింది. వీటిని అభిషేక్ మహంతి క్యాట్‌లో సవాల్ చేయగా ఉపశమనం లభించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ ఈ తిరుమలాదేవితో కూడిన ధర్మాసనం పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.