హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): 732 ఫార్మసీ ఆఫీసర్స్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ డిమాండ్ చేశారు.
మంగళవారం కోఠిలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కందకట్ల శరత్‌బాబు, జాలిగామ అశోక్,శ్రీహరి పాల్గొన్నారు.