హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు రూ.162.54 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్నేరు నుంచి ఏటా సుమారు 10టీఎంసీల వరద వృథాగా సముద్రంలోకి వెళ్తున్నది. ఆ నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించాలని ప్రణాళికలు రూపొందించారు.
తద్వారా రిజర్వాయర్‌తోపాటు సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీటితోపాటు 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. లింక్ కెనాల్‌కు రూ. 162. 54కోట్లతో ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదనలు పంపగా ఆమోదం తెలిపింది. అనుమతుల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.