ప్రజాస్వామ్య పద్ధతిలో మూసీ పునరుజ్జీవ పనులు
మూసీ నది పునరుజ్జీవ ప నులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార తెలిపారు.
- ప్రజల నుంచి 15 రోజులపాటుఅభిప్రాయాలు స్వీకరిస్తున్నాం
- డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): మూసీ నది పునరుజ్జీవ ప నులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార తెలిపారు. మూసీ పునరుజ్జీ వ పనుల పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి, మూసీ క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌తో కలిసి అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవ పనులపై మెయిల్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామ ని, ఏప్రిల్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజల నుం చి వచ్చిన సలహాలు, సూచనలను అధికారులతో కలి సి విశ్లేషిస్తామ ని, అనంత రం విలువైన అభిప్రాయా లు వెల్లడించినవారితో సబ్‌కమిటీ సభ్యులు నేరుగా సంప్రదింపులు జరుపుతారని వివరించారు.
మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2లో చేయాల్సిన పనులకు రోడ్‌మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు సలహాలు, సూచన లు ఇచ్చేందుకు మూసీ సబ్‌కమిటీ స భ్యులు నిరంతరం అందుబాటులో ఉం టారని తెలిపారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి,జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

