హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో తనిఖీల కోసం శాశ్వత ప్రాతిపదికన మానిటరింగ్ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి సారయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
ఈ మేరకు హైదరాబాద్లో గురువారం పాఠశాల విద్య సంచాలకుడికి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులపై మానిటరింగ్ కోసం ఉపాధ్యాయులనే పంపించటంతో ఫలితాలు ఆశాజనకంగా ఉండవని, ఆయా ఉపాధ్యాయుల పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందని తెలిపారు.