పారిశుద్ధ్య స్టార్టప్‌లు!
మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అనువైన నూతన ఆవిష్కరణలు చేసిన స్టార్టప్‌లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం
- మున్సిపాలిటీల అవసరాలకు అనుగుణంగా ఒప్పందాలు
- 20 ఉత్పత్తుల గుర్తింపు
హైదరాబాద్, అక్టోబరు 12 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అనువైన నూతన ఆవిష్కరణలు చేసిన స్టార్టప్‌లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు. ఈ తరహా సేవలకు సంబంధించిన దాదాపు 20 స్టార్టప్‌లను గుర్తించారు. వీటిని రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ప్రదర్శించనున్నారు. ఆయా మున్సిపాలిటీలకు అవసరమైన స్టార్టప్‌లతో ఒప్పందాలు చేసుకోనున్నారు.
టెక్సూల్
చినిగిన, పాడైన దుస్తులను సేకరించి వాటి ద్వారా క్లాత్‌బ్యాగ్‌లు, దుప్పట్లు తయారు చేసి పట్టణాల్లో అవసరమైన వారికి పంపిణీ చేయడమే టెక్సూల్ స్టార్టప్ లక్ష్యం. జైదీప్ సాజేద్ ఆవిష్కరించిన ఈ స్టార్టప్‌ను తొలుత ముంబైలో ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా దీనిని రూపొందించారు. పాత దుస్తులను రీసైకిల్ చేసి యార్న్ తయారుచేయడం ఈ స్టార్టప్ మరో ప్రత్యేకత.
హ్యాపీటాప్

చిన్నారులు, పాఠశాలలు, అంగన్వాడీల్లోని విద్యార్థులు చేతులు కడుక్కొనేందుకు అనువైన వాష్‌బేసిన్‌ను గౌరవ్ సక్సెనా అనే ఔత్సాహికుడు హ్యాపీటాప్ పేరుతో రూపొందించారు. నల్లాను తిప్పాల్సిన అవసరం లేకుండా టచ్ చేయగానే కొద్ది మొత్తంలో నీళ్లు వస్తాయి. దీంతో నీళ్లు చింది పిల్లల బట్టల మీద పడవు. ఈ వాష్‌బేసిన్ వెడల్పుగా ఉంటుంది. 15 లీటర్ల వాటర్ ట్యాంక్‌తో ఇది అనుసంధానమై ఉంటుంది. చేతులు కడిగిన తర్వాత బయటకు వెళ్లే నీళ్ల కోసం 20 లీటర్ల జెర్రీకాన్ ఉంటుంది. దీని ధర రూ.3,500. దీని ఎత్తును విద్యార్థులకు అనుగుణంగా అమర్చుకోవచ్చు. ప్రస్తుతం దీనిని ఐదు రాష్ర్టాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, దవాఖానల్లో వినియోగిస్తున్నారు.
ఫ్యాబ్పాడ్

ఫ్యాబ్పాడ్ పేరుతో దిపేశ్ దిలియా అనే ఔత్సాహికుడు కొత్త స్టార్టప్‌ను ఆవిష్కరించారు. ప్రధానంగా మహిళలు రుతుక్రమం సమయంలో వినియోగించేందుకు అనువైన రీయూజబుల్ పాడ్‌ను తయారుచేశారు. బయో-డిగ్రేడబుల్ విధానంలో తయారుచేసిన ఈ పాడ్‌ను నాలుగేండ్లు లేదా 100 సార్లు ఉతికి వాడుకోవచ్చు. ఫ్యాబ్ పాడ్ కిట్‌లో మూడు రెగ్యులర్ సైజ్ పాడ్లు, ఒకటి పెద్ద సైజు పాడ్, ఒక బ్యాగ్ ఇస్తారు. దీని ధర రూ.245. దీనిని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల సహకారంతో విక్రయించాలని నిర్ణయించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, స్థానికంగా ఉండే మహిళలకు విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిద్వారా మహిళలకు ఆరోగ్యపరంగా మేలు కలిగే అవకాశం ఉంటుందని, పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావని, ఖర్చు కూడా తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్వచ్ఛంద సంస్థల సహకారంతో వివిధ రాష్ర్టాల్లో ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మందికి ఫ్యాబ్పాడ్లను అందజేశారు.
సంపూర్ణ్ జీరో వేస్ట్

ఇంట్లోని తడి వ్యర్థాలతో ఇంటివద్దనే కంపోస్ట్ ఎరువును తయారుచేసే లక్ష్యంతో రూపుదిద్దుకొన్న స్టార్టప్.. సంపూర్ణ్ జీరో వేస్ట్. దీని ఏర్పాటుకు రూ.2,900 వ్యయం అవుతుంది. ఇంట్లో చిన్నస్థలంలో కూడా దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. వంటి గది వ్యర్థాలను ఈ పరికరంలో వేస్తే.. కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. దీనికి అమర్చిన నల్లా ద్వారా ద్రవ వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
అంట్హిల్

పాడైన వస్తువులు, టైర్లు, డ్రమ్ములు ఇతర సామాన్లతో క్రీడా పరికరాలను తయారు చేసే లక్ష్యంతో అంట్హిల్ అనే స్టార్టప్ రూపుదిద్దుకొన్నది. దీనికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వ్యయం అవుతుంది. స్థలం, డిజైన్ల ఆధారంగా ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు 20 రాష్ర్టాల్లో పట్టణ స్థానిక సంస్థల భాగస్వామ్యంతో 325 ప్లేగ్రౌండ్ ప్రాజెక్టులను తయారుచేశారు.
డీ-డిజైన్స్

పాడైన టైర్లను ఉపయోగించి ఇల్లు, పార్కులు, ఆట స్థలాలకు అనువైన పరికరాలను తయారుచేసే లక్ష్యంతో డీ-డిజైన్స్ అనే స్టార్టప్‌ను వైశాలి బియాని ప్రారంభించారు. పట్టణ స్థానిక సంస్థల సహకారంతో 10 ప్రాజెక్టులను చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

