అఫిడవిట్ కాదు.. డిక్లరేషన్ చాలు
ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు రోజుకో మెలిక పెడుతున్నది. మొ త్తంగా బోర్డు అనుసరిస్తున్న తీరు గందరగోళానికి దారి తీస్తున్నది.
- తొలుత అఫిడవిట్ అడిగిన ఇంటర్‌బోర్డు
- తల్లిదండ్రులు, అధ్యాపకుల నుంచి వ్యతిరేకత – నిర్ణయంలో మార్పు
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు రోజుకో మెలిక పెడుతున్నది. మొ త్తంగా బోర్డు అనుసరిస్తున్న తీరు గందరగోళానికి దారి తీస్తున్నది. ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను అధికారులు ఈ నెల 11న విడుదల చేసిన విష యం తెలిసిందే. ఈసారి ఇంటర్ బోర్డు కొత్త నిబంధనను పొందుపరిచింది. అడ్మిషన్ పొందాలంటే విద్యార్థి, తల్లిదండ్రులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
తల్లిదండ్రులు, అధ్యాపక సంఘాలు అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధనను తీవ్రంగా వ్యతిరేకించారు. అఫిడవిట్ కోసం తిరగాలా అంటూ ప్రశ్నించారు. ఇదే విషయంపై మీడియాలోనూ వార్తలొచ్చాయి. స్పందించిన ఇంటర్‌బోర్డు అఫిడవిట్ అవసరం లేదని, డిక్లరేషన్ సరిపోతుందని స్పష్టం చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం డిక్లరేషన్ ఫామ్‌ను ఇంటర్‌బోర్డు వెబ్సైట్లో అం దుబాటులో ఉంచామని, డిక్లరేషన్‌ను పూరించి స మర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నది. ప్రిన్సిపల్స్ దీన్ని తప్పనిసరిగా పాటించాలని, అడ్మిషన్ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆదేశాలిచ్చిం ది.అఫిడవిట్ అవసరం లేదనడాన్ని అధ్యాపక సం ఘాల నేతలు శ్రీనివాస్, సురేష్ స్వాగతించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

