హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా శుక్రవారం నుంచి రాష్ట్రంలోని బడులు సెలవులు పాటించనున్నాయి. ఇప్పటికే ఈ నెల 13 నుంచి 25 వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులిచ్చింది.