కొవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి
హైదరాబాద్ : దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో శ్రీనివాస్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 2 శాతానికి పెరిగిందని తెలిపారు. తెలంగాణలో దాదాపు 10 వారాల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 100 దాటిందని చెప్పారు. తెలంగాణలో కేసుల సంఖ్య 355 నుంచి 555కు పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 811 కేసులు యాక్టివ్గా ఉన్నాయని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దాదాపు 8 వారాలుగా ఒక్క కొవిడ్ మరణం నమోదు కాలేదన్నారు. మరో 4-6 వారాల పాటు కేసుల సంఖ్యలో పెరుగుదల ఉండొచ్చని చెప్పారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. ప్రజలు సహకరించకపోతే మరోసారి మాస్క్ ధరించని వారికి ఫైన్ వేసే పరిస్థితులు వస్తాయన్నారు. రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

