‘ఓపెన్ యాక్సెస్’తో మరో భారం
ఓపెన్ యాక్సెస్ విద్యుత్తు వినియోగదారులకు నైట్ అలవెన్స్ రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అడిషనల్ సర్‌చార్జ్ రూపంలో వారిపై మరో భారాన్ని మోపేందుకు సిద్ధమైంది.
- ఒక్కో యూనిట్‌పై రూ.0.59 చొప్పున అదనపు సర్‌చార్జ్ విధించేందుకు డిస్కంలు సిద్ధం
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఓపెన్ యాక్సెస్ విద్యుత్తు వినియోగదారులకు నైట్ అలవెన్స్ రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అడిషనల్ సర్‌చార్జ్ రూపంలో వారిపై మరో భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. ఒక్కో యూనిట్‌పై రూ.0.59 చొప్పున అదనపు సర్‌చార్జ్ విధించేందుకు అనుమతించాలని కోరుతూ విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి పిటిషన్లు సమర్పించాయి. ఈఆర్సీ అనుమతిస్తే ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై 2026-27 ప్రథమార్ధం(జనవరి నుంచి జూన్) వరకు అదనపు భారం పడుతుంది. ఓపెన్ యాక్సెస్ వినియోగదారులు డిస్కంతో సంబంధం లేకుండా మార్కెట్లో విద్యుత్తును కొనే వెసులుబాటు ఉండటంతో ఎక్సేంజీలో తక్కువ ధరకు దొరికినప్పుడు కొనుక్కుంటున్నారు.
డిస్కం నుంచి సరఫరా అయ్యే విద్యుత్తును వారు వాడుకోవడంలేదు. దీంతో డిస్కంలు నష్టపోతున్నాయి. పవర్ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేయాల్సి వస్తున్నది. డిస్కంలు ఫిక్స్డ్ చార్జీల రూపంలో జనరేటర్లకు చెల్లించాల్సి వస్తుండటంతో ఆర్థికంగా అవి దెబ్బతింటున్నాయి. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు డిస్కంలు సర్‌చార్జ్ రూపంలో వినియోగదారులపై భారం మోపేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. పిటిషన్లపై ఈ ఆర్సీ జనవరి 21న విచారణ జరపనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

