Tamilisai | తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. గవర్నర్గా తాను సంతోషంగానే ఉన్నానని, రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు అని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. ఏదైనా నిర్ణయం ఉంటే తానే తెలియజేస్తానని అన్నారు.
తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రధాని మోదీ, రాముడి దయతో గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లలేదని.. ఎవరినీ రిక్వెస్ట్ చేయలేదని తెలిపారు. తూత్తుకుడి వరదల వల్ల ప్రభావితం అయ్యినందున అక్కడి వెళ్లి చూసివచ్చా తప్ప.. ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని స్పష్టం చేశారు..