దేశానికి అన్నం గిన్నె

- తెలంగాణ ప్రగతి అనేక రాష్ర్టాలకు ఆదర్శం
- బంగారు తెలంగాణ వైపు వేగంగా అడుగులు
- రిపబ్లిక్‌డే సందేశంలో గవర్నర్ తమిళి సై
ప్రత్యేక ప్రతినిధి, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్‌మోడల్‌గా నిలిచిందని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. అతితక్కువ వయసున్న యంగ్ స్టేట్‌గా తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని అభినందించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో తెలంగాణ రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందని కొనియాడారు.
వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ మిగతా రాష్ర్టాలకంటే ముందువరుసలో నిలుస్తున్నదని ప్రశంసించారు. ఐటీ, ఔషధ, లైఫ్‌సైన్సెస్ కంపెనీలకు హబ్‌గా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ.. వెనుకబాటుతనాన్ని అధిగమించి శరవేగంగా బంగారు తెలంగాణ నిర్మాణంవైపు అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు.
అనూహ్యమైన ప్రగతి మార్గం
గత ఆరున్నరేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిమార్గంలో ముందుకు పోతున్నదని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వం అమలుచేసిన విధానాల వల్ల రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయని, ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయని తెలిపారు. హైదరాబాద్ సురక్షిత, ప్రముఖమైన గమ్యస్థానంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఫార్మాస్యూటికల్, ఐటీ హబ్‌గా, లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా హైదరాబాద్ మారిందని చెప్పారు. కరోనా టీకా ‘కొవాగ్జిన్' మన దగ్గరే ఉత్పత్తి కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ -2020లో తెలంగాణ దేశంలో టాప్-5లో నిలిచిందని ప్రస్తావించారు. దశాబ్దాలుగా జరిగిన నిర్లక్ష్యాన్ని, వెనుకబాటుతనాన్ని అధిగమించి తెలంగాణ అతివేగంగా ముందుకు దూసుకుపోయి చాలా రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఐటీ, వ్యవసాయం, విద్యుత్తు, పల్లె, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతుబీమా, తెలంగాణకు హరితహారం వంటి కార్యక్రమాలు అద్భుత ఫలితాలిస్తున్నాయని వివరించారు.
ఆసరా పెన్షన్లు, ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ ప్రజలకు మంచినీటిని అందిస్తే, మిషన్ కాకతీయ భూగర్భ జలాలను పెంచిందని విశ్లేషించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్‌గా నిలిచిందని వివరించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, 1.04 కోట్ల ఎకరాల్లో పంటలు పండాయని, దేశంలోనే 55 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిందన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ నిర్మాణం వైపు వేగంగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల తెలంగాణలో కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగామని.. అతి తక్కువ కేసులు, మరణాలు నమోదయ్యాయని విశ్లేషించారు.
తాజావార్తలు
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్‌రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్