TG Governor | తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డులను సోమవారం ప్రకటించారు. ఎక్సలెన్స్ అవార్డుకు ఎనిమిది మంది ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను గణతంత్ర దినోత్సవం రోజున (ఈనెల 26న) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేయనున్నారు. దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజీ దీప్తి అవార్డులకు ఎంపికయ్యారు.
అలాగే, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, పీబీ కృష్ణ భారతికి సంయుక్తంగా అవార్డును ఇవ్వనున్నారు. అలాగే, ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ అవార్డుకు ఎంపికైనట్లు గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కింద రూ.2లక్షల నగదు పురస్కారంతోపాటు జ్ఞాపిక అందించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక వాభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వనుండగా.. అయితే, వ్యక్తులు, సంస్థలకు అవార్డులు వేర్వేరుగా ఉంటాయి.