Telangana | రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న పాటిల్ సంగ్రాం సింగ్ గణపతిరావును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. రామగుండం డీసీపీగా పనిచేస్తున్న కేకన్ సుధీర్ రామ్‌నాథ్ మహబూబాబాద్ ఎస్పీగా నియమించారు. గవర్నర్ ఏడీసీగా పనిచేస్తున్న ఆకాంక్ష్ యాదవ్‌ను సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేయగా, భూపాలపల్లి ఓఎస్డీగా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను రామగుండం డీసీపీగా బదిలీ చేశారు.