హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కొత్త సంవత్సరం మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 2026 అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించింది. సాధారణ సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. జనవరి 1న (కొత్త సంవత్సరం రోజు) సెలవును రద్దుచేసింది.
ఇది వరకు జనవరి 1 సాధారణ సెలవు దినంగా ఉండగా, కొత్త సంవత్సరం నుంచి ఆప్షనల్ హాలిడేకు మార్చిం ది. దీంతో ఒక రోజు సెలవు రద్దయ్యింది. ఇంతకుముందు బతుకమ్మ ప్రారంభం రోజున సెలవు ఉండగా, ఈ సెలవును రద్దుచేసి సద్దుల బతుకమ్మ రోజు సెలవునిచ్చింది. సాధారణ సెలవులతో పాటు మరో 26 ఆప్షనల్ హాలిడేస్నిచ్చింది.
