Employees Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది.
ఒకే చోట మూడేళ్లు పనిచేసిన ఉద్యోగులు ఈ బదిలీలకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొంది. నాలుగేళ్లకు పైగా ఒకే చోట ఉన్నవారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. అయితే వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు కల్పించారు.
మే 1 -7 వరకు ప్రణాళికలు, ఖాళీల జాబితా
మే 8-15 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 6-24 వరకు దరఖాస్తుల పరిశీలన
మే 25-31వరకు బదిలీలకు ఉత్తర్వులు
జూన్ 1వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది.