‘కేంద్రం వద్దే తేల్చుకోండి’
ఏపీ రాష్ట్రం గోదావరి నదీజలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభు త్వం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. శుక్రవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది.
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఏపీ రాష్ట్రం గోదావరి నదీజలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభు త్వం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. శుక్రవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా గోదావరి నదీజలాల పంపిణీ కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ వేయాలని ఏపీ కోరగా.. తెలంగాణ అధికారు లు అభ్యంతరం తెలిపారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం ఏపీ ఈ అంశాన్ని కేంద్రం వద్దే తేల్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జీఆర్ఎంబీకి విభజన చట్టం ప్రకారం వచ్చిన అధికారాలకే పరిమితం కావాలని తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని పక్కనపెడుతున్నట్టు బోర్డు చైర్మన్ ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల్లో టెలిమెట్రి కేంద్రాలు పెట్టాలనే ప్రతిపాదనలను వ్యతిరేకించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులోనే టెలిమెట్రిలు పెట్టాలని సూ చించారు. వీటిని జాతీ య హైడ్రాలజీ కింద ఏర్పాటుచేయాలని కోరారు. ఇందిర మ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, ఎస్సారెస్పీ-2 విస్తరణ, ఎల్లంపల్లిపై శ్రీపాద ఎత్తిపోతల, కాళేశ్వరం అదనపు టీఎంసీ, కుప్టి పథకాలపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయ గా.. గోదావరిలో న్యాయమైన వాటా ప్రకారమే వీటిని చేపట్టామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

