హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొత్తగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాలకు పరిమిట్లు ఇవ్వడంలో పరిమితి ఉంది. అయితే ఆ పరిమితిని సడలిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.263ని విడుదల చేసింది.
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల కారణంగా ఆటో రిక్షాల పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తూనే ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్/LPG/CNG ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు, 10 వేల ఎల్పీజీ, 10 వేల సీఎన్జీ ఆటో రిక్షాలకు అనుమతినిచ్చింది. పెట్రోలు, డీజిల్ వాహనాలకు సంబంధించిన ఆటోలకు రేటిరోఫిట్మెంట్ చేసి వాటి ఇంజిన్ను ఎలక్ట్రిక్, CNG,LPG లాగా మార్చుకోవడానికి మరో 25 వేల వాహనాలకు అనుమతినిస్తూ జీవో జారీ చేసింది.