హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం మంగళవారం కమిటీ అధ్యక్షుడు అందెశ్రీ అధ్యక్షతన జరిగిన సచివాలయంలో జరిగింది. కమిటీ సభ్యులు ఏనుగు నర్సింహారెడ్డి, సంగనభట్ల నర్సయ్య, పొట్లపల్లి శ్రీనివాస్, మెంబర్ కన్వీనర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నా రు. కాళోజీ నారాయణరావు పేరుమీద ఏటా సాహితీ అవార్డు కింద గ్రహీతను సన్మానించి, జ్ఞాపికతో పా టు రూ.1,01,116 అందజేస్తారు. ఈ అవార్డుకు 40 మంది సాహితీవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 76 మంది నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మల్టీజోన్ -1 పరిధిలో 37 మంది, మల్టీజోన్-2 పరిధిలో 39 మంది ఉన్నారు. వారికి జిల్లాలను కూడా కేటాయించారు.