వనపర్తిలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీలో తల్లిదండ్రులతో వచ్చిన ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. అటుఇటూ తిరుగుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి వద్దకు చేరింది. చిన్నారిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి సరదాగా 10 నిమిషాలు ముచ్చటించారు. తనకు తోఫా ఇవ్వాలని అడగడంతో ఆమెను స్టేజీపై మంత్రి కూర్చోబెట్టి ఇచ్చాడు. తోఫాపై ఉన్న సీఎం కేసీఆర్ ఫొటోను తిలకించిన చిన్నారి గుండెలకు హత్తుకొని ఆసక్తిగా పరిశీలించింది.
– వనపర్తి