హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి (కాకా) వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఏటా డిసెంబర్ 22న అధికారికంగా నిర్వహిస్తామని గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేస్తున్న అనేక జీవోలు తప్పుల తడకగా ఉంటున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా జీవోలు విడుదల చేస్తుండటంతో ప్రభుత్వం అభాసుపాలవుతున్నది. తాజాగా మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్టుగా గురువారం విడుదలైన జీవోలో కాకాను మాజీ ఎంపీగా మాత్రమే సంబోధించారు. తర్వాత నాలుక కరుచుకొని, మార్పులు చేశారు. ఇటీవల విజిలెన్స్ కమిషన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్‌ను నియమిస్తూ విడుదల చేసిన జీవోలో 2022గా పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఉత్తర్వుల్లో 2023గా పేర్కొన్నారు. ఇలా అనేక జీవోల్లో పాత తేదీలనే కొనసాగించారు. పర్యవేక్షణ లోపంతోనే తప్పులు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.