Telangana Chief Secretary | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సచివాలయంలో సీఎస్ శాంతికుమారి సమన్వయ సమావేశం
Telangana Chief Secretary | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి తొమ్మిదేళ్లు పూర్తయ్యి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దశాబ్ధి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
జూన్ 2 నుంచి ఇరవై ఒక్క రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత తొమ్మిదేళ్లలో ప్రతి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా తగు ఏర్పాట్లు చేపట్టాలని సీఎస్ అధికారులకు సూచించారు. గత తొమ్మిదేళ్లలో వాస్తవాలు, గణాంకాలు, సాధించిన విజయాలను వివరించే డాక్యుమెంటరీలను రాష్ట్ర స్థాయిలో ప్రతి శాఖ తయారు చేయాలని, ముఖ్యమైన పబ్లిక్ స్మారక చిహ్నాలు, భవనాలపై విద్యుత్ అలంకరణ చేయాలని ఆమె ఆదేశించారు.
రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలతోపాటు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21 రోజులపాటు ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి నిర్మల, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కే అశోక్‌రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బీ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎం హరికృష్ణ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

