హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. వరల్డ్ ఫుడ్ ఇండియా-2023లో భాగంగా కేంద్ర ప్రభు త్వ పథకమైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం (పీఎంఎఫ్ఎంఈ) పథకం అమలులో అవుట్ స్టాండింగ్ ఫెర్ఫార్మర్ అవార్డు కింద తెలంగాణను కేంద్రం ఎం పిక చేసింది. వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమం ఢిల్లీలో ఈ నెల 3 నుంచి 5 వర కు జరిగింది. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా రాష్ట్ర అధికారులు అఖిల్ గవార్, సుష్మ అవార్డును అందుకున్నా రు. వరల్డ్ ఫుడ్ ఇండియా-2023లో తె లంగాణ భాగస్వామ్య రాష్ట్రంగా ఉండ గా, నెదర్ల్యాండ్ భాగస్వామ్య దేశంగా, జపాన్ ఫోకస్ కంట్రీగా ఉన్నది.