త్వరలో టీజీవో కొత్త కార్యవర్గం ?
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కొత్త కార్యవర్గం త్వరలోనే ఏర్పాటుకానున్నది. నూతన కార్యవర్గాన్ని 2024లో ఎన్నుకొనే అవకాశాలున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 28న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
- 28న కార్యవర్గ భేటీ, ఆ రోజే రాజీనామాలకు చాన్స్
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కొత్త కార్యవర్గం త్వరలోనే ఏర్పాటుకానున్నది. నూతన కార్యవర్గాన్ని 2024లో ఎన్నుకొనే అవకాశాలున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 28న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. తదుపరి 33 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొంటారు.
మొత్తం ప్రక్రియను మూడు వారాల్లో పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, తమ సంఘంలోఎలాంటి గందరగోళం లేదని సంఘం నేతలు ప్రకటించారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి ఊహాజనిత ఆరోపణలని సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నేతలు సామల సహదేవ్, పీ రవీందర్‌కుమార్, బీ వెంకటయ్య, ఎంబీ కృష్ణాయాదవ్, జీ వెంకటేశ్వర్లు, జగన్మోహన్రావులు తెలిపారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ సంఘానికి ఎల్లవేళలా అండగా నిలిచారని, ఆయన సేవలు ఎప్పటికీ ఉంటాయని వారు స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

