హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం, ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్‌రావు వరుసగా మూడోసారి అధికారపగ్గాలు చేపట్టడం ఖాయమని, అందుకు మరో 52 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
కేవలం ప దేండ్ల కాలంలోనే తెలంగాణ అన్ని రం గాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అందుకు సీఎం కేసీఆర్ కృషే కారణమని సోమవారం ఓ ప్రకటన లో కొనియాడారు. దక్షిణాది రాష్ర్టాల్లో ఇప్పటివరకూ ఎవరూ వరుసగా మూడుసా ర్లు అధికారంలోకి రాలేదని, ఈ సారి సీఎం కేసీఆర్ ఆ ఘనత సృష్టించడం తథ్యమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయని కాంగ్రెస్.. ఇప్పుడు అమలు కాని గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్నదని ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో నేతలు ఉన్నారని విమర్శించారు.