ఎల్కతుర్తి, ఏప్రిల్ 22 : కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ మాదిరిగా అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా భావించి సుపరిపాలన అందించిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరులేరని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను లేవనెత్తి, ప్రభుత్వ మెడలు వంచేందుకే సీఎం కేసీఆర్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని వివరించారు. సభకు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం ఉర్దూలో ముద్రించిన చలో వరంగల్ వాల్పోస్టర్ను విడుదలచేశారు.