హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అగ్రి, హార్టికల్చర్ సొసై టీ ఆధ్వరంలో నా ంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రైతు మహోత్సవం-2025 కార్యక్రమాన్ని శుక్రవారం శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించా రు. ఈ నెల 14 వరకు జరిగే ఈ ప్రదర్శనలో పలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు, పరికరాలను అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో భాగంగా అన్ని స్టాళ్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు సందర్శించారు.
ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగంలో ఆధునిక పద్ధతులు, పౌల్ట్రీ ఇండియా నిర్వహిస్తున్న కార్యక్రమాలను గుత్తా ప్రశంసించారు. పౌల్ట్రీ ఇండియా, ఇండియన్ పౌల్ట్రీ ఎక్యూప్మెంట్ మ్యానుఫాక్చర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్‌సింగ్ బయాస్ మాట్లాడుతూ.. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సంస్థలను ఒకే వేదిక కిందికి తీసుకొచ్చేందుకు ఇలాంటి వేదికలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్‌రెడ్డి, భూమి సునీల్, భవానీరెడ్డి, పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు రాధిక, లత పాల్గొన్నారు.