హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పాశమైలారం కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.