Aasara Pension | మానవీయ స్పర్శ ఆసరా.. సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రత్యేకతను చాటుకుంటున్న తెలంగాణ సర్కార్
సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి సామాజిక భద్రతను కల్పిస్తూ మానవీయతను ప్రదర్శిస్తున్నది.
- వృద్ధులకు ఆత్మగౌరవం
- దివ్యాంగులకు జీవనాధారం
- అభాగ్యులకు బతుకు భరోసా
- పింఛన్లకు అర్థం చెప్పిన తెలంగాణ
- ‘సామాజిక భద్రత’లో దేశానికే దిక్సూచి
Aasara Pension | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి సామాజిక భద్రతను కల్పిస్తూ మానవీయతను ప్రదర్శిస్తున్నది. వారికి ప్రతి నెలా పింఛన్లు అందజేస్తూ ‘ఆసరా’గా నిలుస్తున్నది. ‘మీకు మేమున్నాం’ అన్న భరోసాను కల్పిస్తున్నది. లక్షలాది పేదలు, విధి వంచితులు ఆత్మగౌరవంతో జీవించేలా తోడ్పాటునందిస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆటుపోట్లు ఎదురైనా రాజధర్మాన్ని విస్మరించలేదు. అన్నార్తులను, అభాగ్యులను ఆదుకునే విషయంలో మరింత మానవీయతను ప్రదర్శించింది. ఇతర రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలిచింది. ‘పింఛన్ అంటే భిక్ష కాదు. ఈ సమాజ పురోగాభివృద్ధికి, దేశ సంపదల సృష్టికి జీవతమంతా వారు చేసిన శ్రమకు వినమ్రతతో అందిస్తున్న ప్రతిఫలం..’ అన్న స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఇవాళ రాష్ట్రంలో లక్షలాది వృద్ధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకుగా భావించి అభిమానిస్తున్నారు.
తెలంగాణలో 11 వర్గాలకు పింఛన్లు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు కేవలం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు అనే ఐదు క్యాటగిరీలకు మాత్రమే పింఛన్ అందిస్తున్నాయి. తెలంగాణ 11 క్యాటగిరీలకు పింఛన్లు వర్తింపజేస్తుండటం సీఎం కేసీఆర్ మానవీయ కోణానికి మరో నిదర్శనం. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, చేనేతకార్మికులతోపాటు ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, డయాలసిస్ పేషంట్లు, గీత కార్మికులు, వృద్ధకళాకారులు, బీడీ కార్మికులకు సైతం పింఛన్ల పథకాన్ని వర్తింపజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఆదాయ పరిమితి పెంపు
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ తదితర అనేక రాష్ర్టాలు పింఛన్ పథకానికి అర్హుల ఎంపికలో అనేక ఆంక్షలను విధిస్తున్నాయి. అందులో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి ప్రధానమైనది. చాలా రాష్ర్టాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల వార్షిక ఆదాయం మించితే వారికి పింఛన్ ఇవ్వడం లేదు. వయసు తదితర అంశాల్లో సవాలక్ష పరిమితులను విధించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ ఉదారంగా వ్యవహరిస్తూ మానవీయతను చాటుకుంటున్నది. వీలైనంత ఎక్కువ మంది అభాగ్యులకు లబి ్ధచేకూర్చడమే పరమావధిగా పథకాలను అమలు చేస్తున్నది. పింఛన్లకు వార్షిక ఆదాయ పరిమితిని మరే రాష్ట్రంలోనే లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలుగా నిర్ణయించడం సీఎం కేసీఆర్ మానవీయతకు నిదర్శనం. వృద్ధుల పింఛన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించడం మరో విశేషం. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాల ఫలితంగానే రాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం 29 లక్షలకు మించని పింఛన్‌దారుల సంఖ్య నేడు 44 లక్షలు దాటింది.

పలు పెద్ద రాష్ర్టాల్లో పింఛన్ల అమలు ఇలా..
మధ్యప్రదేశ్
- వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు 60 ఏండ్ల్లు.
- ఇచ్చే మొత్తం 60-79 ఏండ్లు ఉంటే నెలకు 300. 80 ఏండ్లు పైబడిన వారికి రూ.500. రాష్ట్రం అదనంగా ఇచ్చే మొత్తం రూ.300.
- వితంతువుల పింఛన్ అర్హత వయస్సు 18-79 నుంచి ఏండ్లు. అందించే మొత్తం రూ.300. రాష్ట్రం అదనంగా ఇచ్చే మొత్తం రూ.300. వయో పరిమితి 18-39 ఏండ్లు.
- దివ్యాంగుల పింఛన్‌కు కేంద్రం వాటా రూ.300. అదీ 18-79 ఏండ్లు ఉండి, 80 శాతం వైకల్యముంటేనే. అదనంగా రాష్ట్రం ఇచ్చేంది రూ.300. అది కూడా 6-18 ఏండ్ల దివ్యాంగులకు మాత్రమే.
గుజరాత్
- వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు 60 ఏండ్లు.
- ఇచ్చే మొత్తం రూ.750. 80 ఏండ్ల్లు పైబడిన వారికి రూ.1000.
- వితంతువుల పింఛన్ అర్హత వయస్సు 18-40 ఏండ్ల్లు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు మించకూడదు. అందించే మొత్తం రూ.1,250.
- దివ్యాంగుల పింఛన్ అర్హత 18-79 ఏండ్లు. వైకల్యం 50 శాతం మించి ఉండాలి. అందించే మొత్తం రూ.1000.
ఉత్తరప్రదేశ్
- వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 60 ఏండ్లు.
- ఇచ్చే మొత్తం నెలకు రూ.1000. అదీ మూడు నెలలకు ఒకసారి ఇస్తారు.
- గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.46,080, పట్టణప్రాంతాల వార్షిక ఆదాయం రూ.56,460 మించకూడదు.
- వితంతువుల పింఛన్ అర్హత వయస్సు 18 ఏండ్ల్లు దాటాలి. అందించే మొత్తం రూ.1000
- దివ్యాంగుల పింఛన్ అర్హత 18 ఏండ్లు దాటాలి. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.46,080, పట్టణప్రాంతాల వార్షిక ఆదాయం రూ.56,460 మించకూడదు. వైకల్యం 40 శాతం మించి ఉండాలి. అందించే మొత్తం రూ.1000.
రాజస్థాన్
- వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు 65 ఏండ్లు. ఇచ్చే మొత్తం రూ.750. 75 ఏండ్ల్లు పైబడిన వారికి రూ.1000.
- వితంతువుల పింఛన్ అర్హత వయసు 18. అందించే మొత్తం రూ.500. 55-60 ఏండ్లు దాటినవారికి 750. 60-75
ఏండ్లవారికి 1000. - దివ్యాంగుల పింఛన్ అర్హత 18 ఏండ్లు. వైకల్యం 40 శాతం ఉండాలి. 55 ఏండ్ల్ల లోపు వారికి రూ.750. 55-75 వరకు రూ.1000. 75 ఏండ్లు పైబడిన వారికి రూ.1250. కుష్ఠు వ్యాధిగ్రస్థులకు రూ.1500.
- (వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.48,000, పట్టణ ప్రాంతాల్లో రూ.60,000 మించకూడదు. అన్ని పింఛన్లకు)
తెలంగాణ
- వృద్ధాప్య పింఛన్ అర్హత కనీస వయస్సు 57 ఏండ్లు. ఇచ్చే మొత్తం రూ.2,016.
- వితంతువుల పింఛన్ అర్హత వయసు 18-57 ఏండ్లు. అందించే మొత్తం రూ.2,016.
- దివ్యాంగుల పింఛన్ అర్హత కనీస వయసు 5 ఏండ్లు. వైకల్యశాతం 40 శాతం. అందించే మొత్తం రూ.3,016.
- అన్నింటికీ మించి గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

