11కేవీ హెచ్‌టీ కనెక్షన్లకు యూనిఫామ్ చార్జీలు
11కేవీ వోల్టేజీ స్థాయి లో హెచ్‌టీ విద్యుత్తు కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ చార్జీల విధానాన్ని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ప్రవేశపెట్టింది.
- విద్యుత్తు నియంత్రణ మండలివెల్లడి
- కేవీఏకు రూ.4,078గా నిర్ణయం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): 11కేవీ వోల్టేజీ స్థాయి లో హెచ్‌టీ విద్యుత్తు కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ చార్జీల విధానాన్ని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి ప్రవేశపెట్టింది. ఈ మేరకు రెగ్యులేషన్ నంబర్ 7 ఆఫ్ 2026ను శనివారం జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 11కేవీ వోల్టేజీ స్థాయిలో అన్ని క్యాటగిరీలకు చెందిన కొత్త హెచ్‌టీ విద్యుత్తు కనెక్షన్లు, అదనపు లోడ్‌కు యూనిఫామ్ సర్వీస్ లైన్ చార్జీలు వర్తిస్తా యి.
ఇప్పటికే ఉన్న 11కేవీ కామన్ ఫీడర్ నుంచి కిలోమీటరు పరిధిలో సాధారణ ఓవర్‌హెడ్ లైన్ల ద్వారా సరఫరా చేసే కనెక్షన్లకు ఈ విధానం వర్తిస్తుంది. అర్హత కలిగిన 11 కేవీ హెచ్‌టీ కనెక్షన్లకు ప్రతీ కేవీఏకు రూ.4,078 చొప్పున సర్వీస్‌లైన్ చార్జీలు వసూలు చేస్తారు. వినియోగదారుల ప్రాం గణంలో టర్మినల్, మీటరింగ్ ఏర్పాట్లకు అయ్యే ఖర్చులు దీనికి అదనంగా ఉంటా యి. అలాగే డెవలప్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న వి ధానాల ప్రకారమే వసూలు చేస్తామని టీజీఎస్పీడీసీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ఉన్న 11కేవీ విద్యుదీకరించిన నెట్వర్క్ లేదా కామన్ఫీడర్ నుంచి ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉన్న కనెక్షన్లకు, 33కేవీ, అంతకంటే ఎక్కువ వోల్టేజీ స్థాయిలో ఇచ్చే కనెక్షన్లకు, ప్రత్యేక ఫీడర్ అవసరమైన కనెక్షన్లకు, భూగర్భ కేబుల్స్ ద్వారా విద్యుత్తు సరఫరా అవసరమై న కనెక్షన్లకు ఈ యూనిఫామ్ సర్వీసు లైన్ చార్జీలు వర్తించవని పేర్కొన్నారు. కొత్త విధానం ద్వారా 11కేవీ హెచ్‌టీ కనెక్షన్లకు సర్వీస్ లైన్ చార్జీల విషయంలో ఏకరీతి వి ధానం అమల్లోకి వచ్చిందని, దీనివల్ల వినియోగదారులకు చార్జీల వివరాలపై స్పష్టత కలుగుతుందని డిస్కమ్ పేర్కొన్నది.
పొలాల చుట్టూ విద్యుత్తు కంచెలు వద్దు
పంటలను అడవి జంతువుల నుంచి రక్షించుకునే పేరుతో పొలాల చుట్టూ విద్యు త్తు ప్రవహించే జీఐ వైర్లు లేదా విద్యుత్తు కంచెలను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమైన చర్యగా దక్షిణ డిస్కమ్ పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు సెక్షన్ పరిధిలోని పెద్దమంగళారం గ్రామశివారులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత విద్యుత్తు కంచెను తాకి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ నేపథ్యలో డిస్కమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ప్రాణనష్టం సంభవిస్తే పరిస్థితులు, దర్యాప్తు ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని మింట్‌కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో శనివారం జాతీ య ఐక్యత దినోత్సవం నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

