TS Govt | కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో అభ్యంతరాలను పట్టించుకోవడం లేదంటూ సెంట్రల్ వాటర్ బోర్డు చైర్మన్‌కు రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో 954 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. తొమ్మిది అంశాల్లో ఒక్కదానిపై ఏపీ చర్యలు తీసుకోలేదని ఈఎన్సీ పేర్కొన్నారు.
పీపీఏ నుంచి సమన్వయం లోపం ఉందని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సుప్రీంకోర్టులో కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం తెలిపింది. సీడబ్ల్యూసీ, పీపీఏ భేటీల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టాలని జల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.