హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో తెలంగాణ ఉద్యోగుల సంఘం యూనిట్ ఏర్పాటైంది. సంఘం చైర్మన్ ఏ పద్మాచారి, ప్రెసిడెంట్ రవీందర్ కుమార్ సోమవారం ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మాచారి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం క్రియాశీలకంగా పనిచేసిందని గుర్తుచేశారు. కేసీఆర్ పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐపీఎం ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, సంఘం ప్రధాన కార్యదర్శులు హరీశ్కుమార్రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఆల్ ఇండియా జ్యుడిషియరీ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఎండీ ముంతాజ్ పాషా, గ్రేటర్ సిటీ ప్రెసిడెంట్ ఎన్ నర్సింగ్‌రావు, నర్సిరెడ్డి, అరవింద్‌కుమార్, జాకబ్, నజీర్, ఎస్ఎస్ కిశోర్, రాజేంద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.