పీఆర్సీ లేక మూడేండ్లు.. డీఏలు రాక రెండేండ్లు!
ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన కరువుభత్యం విడుదలలో కా్రంగెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తున్నది. ఉద్యోగులను నయవంచనకు గురిచేస్తున్నది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతున్నది. ఠంచన్‌గా కరువుభత్యాన్ని విడుదల చేస్తున్నది. కానీ రాష్ట్రంలో మాత్రం పెండింగ్ డీఏలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తాజాగా కేంద్రం మూడు శాతం డీఏను ప్రకటించింది.
- ఉద్యోగులను వంచిస్తున్న కాంగ్రెస్
- నాలుగు డీఏలు బాకీ పడ్డ సర్కార్
- మండిపడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన కరువుభత్యం విడుదలలో కా్రంగెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తున్నది. ఉద్యోగులను నయవంచనకు గురిచేస్తున్నది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతున్నది. ఠంచన్‌గా కరువుభత్యాన్ని విడుదల చేస్తున్నది. కానీ రాష్ట్రంలో మాత్రం పెండింగ్ డీఏలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తాజాగా కేంద్రం మూడు శాతం డీఏను ప్రకటించింది. ఇది 2026 జూలై మాసంలో చెల్లించాల్సిన డీఏ. అంటే కేంద్రం చెల్లించాల్సిన డీఏలు ఒక్కటి కూడా పెండింగ్‌లో లేవు. రాష్ట్రంలో మాత్రం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
రాష్ట్రంలో 3.6 లక్షల మంది మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మరో 2.9 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం (డీఏ) విడుదల చేయాలి. ఐదేండ్లకోసారి కొత్త పీఆర్సీ ప్రకటించాలి. తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు 2023లో ముగిసింది. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. పీఆర్సీ కమిటీ నివేదికను సిద్ధంచేసినా ఆ నివేదికను సర్కార్ స్వీకరించేందుకు సుముఖంగా లేదు.
అంటే దాదాపు మూడేండ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లు పీఆర్సీని నష్టపోయారు. ఇక 2025 జనవరి నుంచి డీఏలను సర్కార్ బాకీపడింది. అంటే రెండేండ్ల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ, డీఏలు పెండింగ్‌లో ఉండటంపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో పెండింగ్ డీఏలను తక్షణమే చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచింది. కానీ అధికారంలోకి వచ్చాక విస్మరించింది. ఉద్యోగసంఘాలు జేఏసీగా ఏర్పడి చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తే.. కార్యాచరణ ప్రకటిస్తే ఇటీవలే రెండు డీఏలను విడుదల చేసింది.
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
ప్రభుత్వం పెండింగ్‌లోని డీఏలను విడుదల చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ కోరారు. కేంద్ర ప్రభుత్వ తరహాలో డీఏలను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు వోడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య కోరారు. డీఏల కోసం ప్రతిసారీ ఉద్యమించాల్సి రావడం అత్యంత బాధాకరమని తెలంగాణ ప్రొగ్రెస్సివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.
కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
- జూలై 1 నుంచే అమల్లోకి – కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరువు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల డీఏ 60 నుంచి 63 శాతానికి పెరిగింది. అలాగే పెన్షనర్లకు కరువు భృతి (డీఆర్)ని కూడా 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. డీఏ, డీఆర్ పెంపు కారణంగా ప్రభుత్వంపై అదనంగా రూ.10,016 కోట్ల భారం పడనుందని చెప్పారు. తాజా పెంపుతో 48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వం ఏప్రిల్‌లో కరువు భత్యాన్ని 2 శాతం పెంచింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

