హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్కో)లో భారీగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పదోన్నతులు కల్పిస్తూ జెన్కో సీఎండీ రోనాల్డ్‌రోస్ ఉతర్వులు జారీ చేశారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఇద్దరు ఎస్ఈలకు చీఫ్ ఇంజినీర్లుగా పదోన్నతులు దక్కాయి. ఏడుగురు డీఈలకు ఎస్ఈగా, 34 మంది ఏడీఈలకు డీఈగా, 170 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 33 మంది ఏఏఈలకు ఏడీఈలుగా పదోన్నతి కల్పించారు. మెకానికల్ విభాగంలోని ముగ్గు రు డీఈలకు సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా, 12 మంది ఏడీఈలకు డీఈలుగా పదోన్నతులు దక్కాయి. జెన్కో డిజిటలైజేషన్ సీఈ శ్రీ ప్రకాశ్‌ను బదిలీచేసి, కేటీపీపీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సీఈగా పోస్టింగ్ ఇచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాలలకు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టును మంజూరుచేసి, బీఈడీ, డీఎడ్ అర్హతలు గల ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఎస్జీటీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండీ కమ్రుద్దీన్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనిల్‌కుమార్, రాందాస్ ఒక ప్రకటనలో కోరారు. పండిట్ అప్‌గ్రేడేషన్‌తో ఎస్జీటీలు నష్టపోయారని, కావున పీఎస్ హెచ్ఎం పోస్టులతో నష్టాన్ని పూడ్చి, వారికి న్యాయం చేయాలని కోరారు.