హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): ఎప్‌సెట్ మాక్ సీట్ల కేటాయింపు తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు సగానికిపైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకున్నారు. ఎప్‌సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 95,256 మంది హాజరయ్యారు. వీరిలో 94,354మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఎంచుకున్నా రు. ఆప్షన్లు బట్టి 83,054 సీట్లకు 77,154 మంది విద్యార్థులు మాక్ కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కించుకున్నారు.
5,900 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మాక్ సీట్ల కేటాయింపు తర్వాత 44,553 మంది వెబ్ ఆప్షన్లు మార్చుకున్నారు. దాదాపు సగానికిపైగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకోవడం గమనార్హం. ఈ ఆప్షన్లు, విద్యార్థుల ర్యాంకును బట్టి ఈ నెల 18న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు.