TG EAPCET | తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ని వెల్లడించింది.ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈఏపీ సెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్టీయూ నిర్వహించనున్నది.